HomeTelugu TrendingNaga Chaitanya: డిజాస్టర్‌ హీరోయిన్‌తో అక్కినేని హీరో.. అవసరమా అంటున్న ఫ్యాన్స్‌!

Naga Chaitanya: డిజాస్టర్‌ హీరోయిన్‌తో అక్కినేని హీరో.. అవసరమా అంటున్న ఫ్యాన్స్‌!

Naga Chaitanya with Disaster heroineNaga Chaitanya: స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే కు ఇటీవలే.. టాలీవుడ్‌లో అవకాశలు తగ్గాయి. ఈ క్రమంలో తెలుగు సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ రీ ఎంట్రీ కోసం ఫ్యానస్‌ ఆసక్తిగా ఉన్నారు. తాజాగా వీరి వెయిటింగ్‌కి తెర దించుతూ బుట్టబొమ్మ త్వరలోనే టాలీవుడ్‌లో మెరవనున్నట్లు టాక్‌.

అక్కినేని నాగచైతన్య హీరోగా- ‘విరూపాక్ష’ డైరెక్టర్‌ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుందట. పూజా హెగ్డే హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ ఉందని, మంచి మూవీ కోసం వెయిట్‌ చేస్తున్న పూజకు, ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ గా అవుతుందంటున్నారు.

Naga Chaitanya 1 Naga Chaitanya,pooja hegde,Karthik Varma Dandu,Thandel

అయితే నాగచైతన్యకు కూడా పెద్దగా హిటులు లేవు.. ఈ క్రమంలో డిజాస్టర్‌ హీరోయిన్‌తో కలిసి నటించడం అవసరమా అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్‌. ఒక లైలా కోసం సినిమాలో ప్రేమికులుగా నటించారు నాగచైతన్య, పూజా హెగ్డే. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్‌ అయింది. మళ్లీ ఇన్నాళ్లు.. వీరిద్దరూ జతకట్టబోతున్నారు.. మరి ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తారో చూడాలి.

‘విరూపాక్ష’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ వర్మ దండు. ఈ సినిమా మంచి టాక్‌ నే తెచ్చుకుంది. ఆయన దర్శకత్వంలో బోగవల్లి ప్రసాద్, సుకుమార్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ప్రస్తుతం పూజ బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu