HomeTelugu Trendingనాగశౌర్య 22 మూవీ షూటింగ్‌ ప్రారంభం

నాగశౌర్య 22 మూవీ షూటింగ్‌ ప్రారంభం

Naga shourya NS22 shootin
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తన ’22’వ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో వస్తున్న ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షిర్లీ సెటియా హీరోయిన్. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో నాగశౌర్య – షిర్లీ సెటియా మరియు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇంకా టైటిల్ ఫిక్స్‌ చేయని ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ, బ్రహ్మజీ, సత్య తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇకపోతే నాగాశౌర్య ప్రస్తుతం ‘లక్ష్య’ , ‘వరుడు కావలెను’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమాలు చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu