HomeTelugu Trendingఈతరం శ్రీరాముడివి: ఉపాసన, నాగబాబు

ఈతరం శ్రీరాముడివి: ఉపాసన, నాగబాబు

Nagababu and upasana about
మెగాస్టార్‌ రామ్ చరణ్ ఈ రోజు 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇక ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో చెర్రీ పోస్టర్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ పోస్టర్ దే హల్ చల్. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన అయితే ఆ పోస్టర్ లో చెర్రీ ని చూస్తుంటే నిజంగా శ్రీరామచంద్రుడిని చూస్తున్నట్లుందని తెలియజేసింది. ఇదిలా ఉంటే చరణ్ బాబాయి నాగబాబు కూడా రామ్ చరణ్ ను రాముడితో పోల్చారు. ‘‘రాముడు దేవుడు మాత్రమే కాదు.. అన్నదమ్ముల ప్రేమకు ప్రతిరూపం. మా జనరేషన్ లో అన్నయ్య చిరంజీవి రాముడిలా ఉన్నారు. ఈ జనరేషన్ లో అన్నదమ్ములకు అండగా ఉంటూ నువ్వు రాముడివయ్యావు’’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu