HomeTelugu Trending'మన్మథుడు 2' ట్రైలర్‌

‘మన్మథుడు 2’ ట్రైలర్‌

2 24ప్రముఖ నటుడు నాగార్జున హీరోగా నటించిన సినిమా ‘మన్మథుడు 2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ గురువారం విడుదలైంది. ‘అద్భుతం.. అమోఘం.. ఇలాంటి పథకం మహాభారతంలో ఆ శ్రీకృష్ణుడు కూడా వేయలేదు’ అంటూ నాగ్‌ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. నాగ్‌కు ఎలాగైనా పెళ్లి చేయాలనుకుంటారు ఇంట్లోవారు. కానీ ఆయన ‘ఒక్క పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను’ అంటూ మాటదాటేస్తుంటారు. ‘ఇదేమన్నా స్వయవరం అనుకుంటున్నారా ఏంటి’ అని నాగ్ అంటే ఇందుకు వెన్నెల కిశోర్‌.. ‘అదే కదా.. మీరేమన్నా మన్మథుడా ఏంటి’ అనడం నవ్వులు పూయిస్తోంది. ఇందులో నాగ్‌ చాలా స్టైలిష్‌గా కనిపించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించారు. ఆగస్ట్‌ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu