HomeTelugu Trendingయండమూరి డైరెక్షన్‌లో 'నల్లంచు తెల్లచీర'

యండమూరి డైరెక్షన్‌లో ‘నల్లంచు తెల్లచీర’

Nallanchu tellacheera mov

యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా.. దర్శకుడిగా సినీ, సాహిత్య ప్రియుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. చాలా కాలం తర్వాత ఆయన మెగాఫోన్‌ పట్టారు. తాను రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో భూషణ్‌, దియా, జెన్నీ, సాయి, కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఊర్వశి ఓటీటీ సమర్పణలో రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘యండమూరి శైలిలో సాగే వినూత్నమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నాం. అందరికీ నచ్చేలా ఉంటుంది. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి తాళ్లూరి నాగరాజు సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu