HomeTelugu Trendingస్లిమ్‌గా మారిన నమిత.. రీఎంట్రీ కోసమేనా!

స్లిమ్‌గా మారిన నమిత.. రీఎంట్రీ కోసమేనా!

6 15తెలుగులో ‘సొంతం’ సినిమా ద్వారా అడుగుపెట్టిన నమిత ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. తమిళంలో మాత్రం తిరుగులేని తారగా మారింది. యువత నుంచి పెద్దల వరకు అందర్నీ ఆకట్టుకుంది. ‘మచ్చాన్’ అంటూ అభిమానులను ఆప్యాయంగా పలకరించిన అమ్మడుకు ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. 2010 తర్వాత పెద్దగా నటించలేదు. 2016లో ‘పులి మురుగన్‌’ చిత్రం తర్వాత మళ్లీ హవా చాటుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ 2017లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సినిమాలకు కాస్త విరామమిచ్చింది. కొంత కాలంగా సినీ కార్యక్రమాలకు మాత్రం హాజరవుతోంది. మళ్లీ ఆమె నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు నమిత స్లిమ్‌గా మారిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఓ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu