HomeTelugu Big Storiesహ్యాపీ బర్త్ డే ఎంబీ: నమ్రత శిరోద్కర్‌

హ్యాపీ బర్త్ డే ఎంబీ: నమ్రత శిరోద్కర్‌

Namrata special birthday wiటాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు పుట్టిన రోజు కావడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన జీవిత భాగస్వామి నమ్రత శిరోద్కర్ మహేశ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించారు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా మహేశ్ బాబుతో కలసి ఉన్న ఫొటోను నమ్రత పోస్ట్ చేసింది. కుటుంబమంతా కలసి వెకేషన్ కు వెళ్లిన ఫొటో అది. రాత్రి వేళ టెర్రస్ పై ఉన్న మహేశ్ ను వెనుక నుంచి హత్తుకున్న ఫొటో అది. ‘హ్యాపీ బర్త్ డే ఎంబీ!! ఈ రోజు, ప్రతి రోజూ నీవే, నీవే’ అంటూ క్యాప్షన్ పెట్టింది.

మహేశ్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలిసిందే. నటన తర్వాత కుటుంబానికే మహేశ్ బాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. తరచూ భార్య, కుమార్తె, కుమారుడితో కలసి ఆయన విదేశీ యాత్రలకు వెళ్లి వస్తుంటాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్ బాబు నటిస్తున్నాడు. మహేశ్- తివ్రిక్రమ్ కలసి పనిచేస్తున్న మూడో సినిమా ఇది.

20230809fr64d33c8991743

Recent Articles English

Gallery

Recent Articles Telugu