ఘాజీకి కలెక్షన్ల వెల్లువ!

దగ్గుబాటి రానా నటించిన ఘాజీ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది. మొదటిరోజు తెలుగు, తమిళ, హిందీ బాషల్లో కలిపి దాదాపు 4.25 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు 5.25 కోట్లను వసూలు చేసినట్లు సమాచారం. దీంతో రెండు రోజులు కలిపి మొత్తం తొమ్మిది కోట్ల యాభై లక్షలు రాబట్టింది.

ఇక హిందీలో రెండు రోజుల్లో దాదాపు 4 కోట్లకు దగ్గరగా సినిమా కలెక్షన్స్ చేరుకోవడం విశేషం. ఓవర్సీస్ లో కూడా ఇదే స్పీడ్ తో దూసుకుపోతుంది. తొలిరోజు 141,291 డాలర్స్ ను కలెక్ట్ చేసింది. ఇక ఈ వారంలో థియేటర్ల సంఖ్య మరింత పెంచనున్నారు. శుక్రవారం వరకు మరే సినిమా రిలీజ్ కావడం లేదు గనుక అప్పటివరకు ఘాజీ తన ప్రతాపాన్ని చూపించడం ఖాయమని తెలుస్తోంది.