HomeTelugu Trending'నాని 30'వ సినిమా గ్లింప్స్‌ విడుదల

‘నాని 30’వ సినిమా గ్లింప్స్‌ విడుదల

Nani 30 Glimpse

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ఇవాళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నాని 30 వ చిత్రాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్‌ వీడియో షేర్ చేశాడు నాని. దసరా సినిమా గెటప్‌లో ఉన్న నానిని చూసి డాడీ నీ గడ్డం నచ్చలేదంటోంది అతడి కూతురు.

ఈ గ్లింప్స్ వీడియోలో నాని తన కూతురు సంభాషణ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువ సాంకేతిక నిపుణులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu