HomeTelugu Trendingనాని గ్యాంగ్ లీడర్ వచ్చేస్తున్నాడు

నాని గ్యాంగ్ లీడర్ వచ్చేస్తున్నాడు

3 17

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా “నాని గ్యాంగ్‌ లీడర్‌” సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం)లు నిర్మిస్తున్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఆగస్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలు మాట్లాడుతూ మా బ్యానర్‌లో చేస్తున్న మరో విభిన్న చిత్రం నాని గ్యాంగ్ లీడర్ 14 నుండి శంషాబాద్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. జూన్ 30 నాటికి సినిమా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

చిత్ర దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ ఈ సినిమా ఇంతకముందెన్నడూ రాని ఓ డిఫరెంట్ లుక్ తో ఉండే ఫామిలీ ఎంటర్‌టైనర్. సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ కూడా ఉంటుంది. అది ఏమిటనేది స్క్రీన్‌ పైన చూస్తేనే బాగుంటుంది. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉండే సినిమా ఇది అన్నారు. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu