HomeTelugu Trendingమరోసారి నెగెటివ్‌ పాత్రలో నాని!

మరోసారి నెగెటివ్‌ పాత్రలో నాని!

Nani in negative role
మొదటి నుంచి నాని తనని తాను తెరపై కొత్తగా ఆవిష్కరించుకుంటూ వెళుతున్నాడు. ఒక వైపున హీరోగా సక్సెస్ లను అందుకుంటూనే, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయడానికి కూడా వెనుకాడటం లేదు. గతంలో ఆయన

నేచురల్‌ స్టార్‌ నాని ‘జంటిల్మెన్’ , ‘వి’ సినిమాలతో నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. మరోసారి ఆయన ఈ తరహా సాహసం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని ‘దసరా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలోనే కనిపిస్తాడట. ఈ పాత్రలో కొత్త నాని కనిపిలుస్తాడని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా అలరించనుంది. సంతోష్ నారాయణ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగును, త్వరలో మొదలు పెడతారట. ఇక ఈ సినిమాతో పాటు నాని ‘అంటే .. సుందరానికీ!’ చేస్తున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu