HomeTelugu Trendingవిజయ్‌- రష్మిక వీడియోపై నాని స్పందన

విజయ్‌- రష్మిక వీడియోపై నాని స్పందన

Nani reacts to Vijay Rashmi

నేచురల్‌ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. నాని 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండ‌గా.. మలయాళ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబరు 7న తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక న‌వంబ‌ర్ 29న‌ వైజాగ్‌లోని ఆర్ కే బీచ్ వ‌ద్ద ఉన్న గోకుల్ పార్కులో జరిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వేడుక‌లో హీరో విజయ్‌ దేవరకొండ, నటి రష్మికకు సంబంధించిన ఫొటోలు స్క్రీన్‌పై రావ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. దీంతో దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోలు రావడం ప‌ట్ల ఈవెంట్‌ నిర్వాహకులతోపాటు చిత్రబృందాన్నీ నెటిజన్లు తప్పుబట్టారు. ఈ వివాదం ఇంకా ముదురుతుండ‌టంతో నటుడు నాని తాజాగా స్పందించారు.

నాని మాట్లాడుతూ.. విజయ్‌, రష్మిక ఫొటోలను స్క్రీన్‌పై వేయడం నిజంగానే దురదృష్టకరం. ఆ ఫొటో చూసి మేము కూడా షాకయ్యాం. అలాంటి ఈవెంట్స్‌ కోసం ఎంతోమంది వర్క్ చేస్తుంటారు. ఇక మేమంతా స్నేహితులమే. సినిమా ప్రమోషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వాళ్లకు కూడా తెలుసు. ఆ చర్య వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే నాతోపాటు చిత్ర‌యూనిట్ అంతా క్షమాపణలు చెబుతున్నాం అంటూ నాని చెప్పుకోచ్చాడు. ఇక తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్న‌ట్లు తెలుస్తుంది. హాయ్‌ నాన్నలో బేబీ కియారా, శృతిహాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనుండ‌గా.. డిసెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu