HomeTelugu Trendingరాక్షసుడిగా 'నాని' ఫస్ట్‌లుక్‌

రాక్షసుడిగా ‘నాని’ ఫస్ట్‌లుక్‌

1 25

నేచురల్‌ స్టార్‌ నాని ఇప్పటివరకూ క్లాస్‌, మాస్‌, నటనకు ప్రాధాన్యం ఇన్న పాత్రల్లో అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా రాక్షసుడిగా మారారు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో హీరో సుధీర్‌బాబుతో కలిసి ఆయన నటిస్తున్న చిత్రం ‘వి’. సోమవారం ‘వి’ చిత్రంలోని రక్షకుడిగా సుధీర్‌బాబు లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం మంగళవారం రాక్షసుడు పాత్ర పోషిస్తున్న నాని ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకుంది.

ఈ చిత్రంలో నాని విలన్‌ లక్షణాలు ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నివేదా థామస్‌, ఆదితిరావు హైదరీ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్‌మెన్‌’ చిత్రాల తర్వాత నాని-ఇంద్రగంటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu