HomeTelugu Trendingనాని, సుధీర్‌బాబు 'వి' ట్రైలర్

నాని, సుధీర్‌బాబు ‘వి’ ట్రైలర్

Nani V trailer released
నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ‘వి’. నాని కెరీర్‌లో 25వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతుంది. ఈ రోజు చిత్రబృందం ‘వి’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచింది. “ఎలా ఫినిష్ చేద్దాం, మళ్లీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు” అంటున్న నాని డైలాగ్ ఆకట్టుకుంటుంది. నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో నటించగా నివేదా థామస్, అదితి రావు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చిలో విడుదల కావలసిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా, సుధీర్ బాబు పోలీస్ గా కనిపిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu