HomeTelugu Trendingకార్తికేయ-2: అడిగా నన్ను నేను అడిగా వీడియో సాంగ్‌

కార్తికేయ-2: అడిగా నన్ను నేను అడిగా వీడియో సాంగ్‌

Nannu Nenu Adiga song from
నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన ‘కార్తికేయ’. చందూ మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రూపొందింది. అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ ఈ కథ తిరగనుంది. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ‘అడిగా నన్ను నేను అడిగా .. నాకెవ్వరూ నువ్వనీ..’ అంటూ ఈ పాట సాగుతోంది.

నిఖిల్ – అనుపమ ట్రావెల్ చేస్తుండగా వారిపై చిత్రీకరించిన పాట ఇది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా విడుదల కావలసింది. కానీ ఆగస్టు మొదటివారంలో ఏ సినిమాను విడుదల చేయనున్నట్టు నిఖిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu