HomeTelugu Trendingనారా రోహిత్‌ కొత్త సినిమా 'ప్రతినిధి-2' ప్రారంభం

నారా రోహిత్‌ కొత్త సినిమా ‘ప్రతినిధి-2’ ప్రారంభం

Nara Rohit new movie Prath
నారా రోహిత్ తన కొత్త సినిమా ‘ప్రతినిధి-2’ సినిమా ప్రకటించారు. ఆయన 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సందీప్ పిక్చర్ ప్యాలెస్ (ఎస్‌పిపి) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో వెంకటేష్ నిమ్మల పూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా నేడు గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ఈ ప్రారంభమైంది. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి, విజయ్ కృష్ణ ఈ సినిమా స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.

ప్రదీష్ ఎం వర్మ కెమెరా స్విచాన్ చేయగా, ముహూర్తం షాట్‌కి గౌతమ్‌రెడ్డి క్లాప్‌ కొట్టారు. ఇక తొలి షాట్‌కి విజయ్‌కృష్ణ గౌరవ దర్శకత్వం వహించగా ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు మేకర్స్.

ఈ సినిమాలో విర్తి వాఘని హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, సునైనా, రఘు బాబు వంటి వారు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ అండ్ ప్రామెసింగ్ టెక్నికల్ టీం ఈ చిత్రానికి పని చేస్తున్నారని మేకర్స్ వెల్లడించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu