HomeTelugu Trendingనాని కొత్త సినిమా 'టక్‌ జగదీష్‌' ప్రారంభం

నాని కొత్త సినిమా ‘టక్‌ జగదీష్‌’ ప్రారంభం

2 28
నేచురల్‌ స్టార్‌ నాని తాజా చిత్రం ‘టక్ జగదీష్’ లాంఛనంగా ప్రారంభమైంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హైదరాబాదులో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ‘టక్ జగదీష్’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 11 నుంచి జరగనుంది. శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. గతంలో వచ్చిన ‘నిన్ను కోరి’ బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu