HomeTelugu NewsNaveen Polishetty : అమెరికాలో యాక్సిడెంట్.. చేతికి గాయాలు

Naveen Polishetty : అమెరికాలో యాక్సిడెంట్.. చేతికి గాయాలు

Naveen polishetty met an ac Naveen polishetty met an accident at america,Naveen polishetty,Anaganaga Oka Raju

Naveen polishetty met accident: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా మంచి టాక్‌నే తెచ్చుకుంది. ఈమూవీ మంచి కలెక్షన్స్ ని అందుకొని నవీన్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్టుగా ఇచ్చింది. ప్రస్తుతం ఈ హీరో ‘అనగనగ ఒక రాజు’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరోకి యాక్సిడెంట్ జరిగిన్నట్లు తెలుస్తుంది.

నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారట. అక్కడ బైక్ డ్రైవ్ చేస్తూ జారిపడడంతో చేతికి ఫ్యాక్చర్ అయ్యినట్లు సమాచారం. దీంతో ఆయన రెండు నెలలు పాటు రెస్ట్ తీసుకోనున్నారట. మరి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఫ్యాన్స్‌ కంగారు పడుతున్నారు. టేక్ కేర్ అంటూ నవీన్ పోలిశెట్టికి ట్వీట్స్ చేస్తున్నారు.

కాగా మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి. మ్యాడ్ కంటే ముందే అనగనగా ఒక రాజు మూవీ రావాల్సింది. కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ కొన్ని కారణాలు వల్ల అది వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మొదలైందా లేదా అనే అప్డేట్ కూడా లేదు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu