HomeTelugu Trendingనాయకుడు మూవీపై మహేష్‌బాబు కామెంట్స్

నాయకుడు మూవీపై మహేష్‌బాబు కామెంట్స్

Uday Nidhi Nayakudu movie t
తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘మామన్నన్’ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగులో ‘నాయకుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఎంతో నైపుణ్యం ఉన్న చిత్రబృందం ఈ సినిమా కోసం పనిచేసిందని, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని వెల్లడించారు.

నాయకుడు సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఓ పెద్దకులానికి చెందిన వ్యక్తి కారణంగా ఓ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఇతర కులాలను దోపిడీ చేస్తున్న ఆ వ్యక్తి ఆగడాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడనే అంశంపై సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమాని ఏషియన్‌ మల్టీప్లెక్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు నాయకుడు పేరుతో తెలుగులో ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu