HomeTelugu Big Storiesగాడ్‌ఫాద‌ర్: నయనతార ఫస్ట్‌లుక్‌

గాడ్‌ఫాద‌ర్: నయనతార ఫస్ట్‌లుక్‌

Nayanthara first Look From

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాడ్‌ఫాద‌ర్’. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘లూసీఫ‌ర్‌’ మూవీకు రీమేక్‌గా తెరకెక్కింది. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మోహ‌న్ రాజా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వ‌రుస‌గా అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని న‌య‌న‌తార పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

తాజాగా విడుద‌లైన న‌య‌న‌తార లుక్‌కు ప్రేక్ష‌కులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో న‌య‌న తార స‌త్య‌ప్రియ జ‌య‌దేవ్‌గా క‌నిపించనుంది. లూసీఫ‌ర్‌లో మంజు వారియ‌ర్ పోషించిన పాత్రలో న‌య‌న‌తార క‌నిపించ‌నుంది. ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్‌, ఆర్.బి.చౌద‌రి, ప్ర‌సాద్ ఎన్‌వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు స‌ల్మాన్‌ఖాన్ ముఖ్య పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, సునీల్, స‌త్య‌దేవ్‌లు కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu