HomeTelugu Newsరమ్యకృష్ణ 'నీలాంబరి' తరహా పాత్రలో నయన్‌..!

రమ్యకృష్ణ ‘నీలాంబరి’ తరహా పాత్రలో నయన్‌..!

8 23
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించిన ‘నరసింహా’ సినిమా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ‘నీలాంబరి’గా రమ్యకృష్ణ చేసిన పాత్ర ఆమె కెరియర్లో హైలైట్‌గా మిగిలిపోయింది. తాజాగా అటువంటి పాత్రలో నయనతార కనిపించనున్నట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు … మలయాళ సినిమాలతోను నయనతార బిజీగా వుంది.

రీసెంట్ గా ఆమె ఒక మలయాళ సినిమాకి సైన్ చేసిందట. ఈ సినిమాలో ‘నీలాంబరి’ తరహా పాత్రను చేయడానికి దర్శక నిర్మాతలు నయనతారను ఎంపిక చేసుకున్నారు. సొంత గడ్డపై సినిమా అనే సరికి నయనతార ఆ పాత్రను చేయడానికి వెంటనే అంగీకరించిందని అంటున్నారు. పారితోషికం విషయాన్ని ఆమె పెద్దగా పట్టించుకోకపోగా, ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా వస్తానని కూడా చెప్పిందట. సాధారణంగా నయనతార పారితోషికం విషయంలోను .. ప్రమోషన్స్ విషయంలోను చాలా కరెక్ట్‌గా ఉంటుంది. అలాంటిది ఆ రెండింటిని ఆమె పక్కన పెట్టేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu