HomeTelugu Trendingఆ పాత్రలో నటించి తప్పు చేశాను: నయనతార

ఆ పాత్రలో నటించి తప్పు చేశాను: నయనతార

10 5ప్రముఖ నటి నయనతార ‘గజనీ’ సినిమాలో ‘చిత్ర’ పాత్రలో నటించడం తాను చేసిన తప్పు అని అన్నారు. ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి నయనతార. ఇటు తెలుగుతోపాటు, అటు తమిళంలోనూ ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి కోలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌గా పేరుపొందారు. తాజాగా ఆమె మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘2005లో విడుదలైన ‘గజనీ’ చిత్రంలో ‘చిత్ర’ పాత్రలో నటించినందుకు పశ్చాత్తాపడ్డాను. ఈ సినిమాలో ఆసిన్‌ నటించిన ‘కల్పన’ పాత్రలాగానే నేను నటించిన ‘చిత్ర’ పాత్ర కూడా ఉంటుందని అనుకున్నాను. కానీ తర్వాత చాలా బాధపడ్డాను.’ అని నయనతార తెలిపారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించారు. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం నయనతార ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దర్బార్‌’ చిత్రంలో నటించారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఆమె జంటగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu