HomeTelugu Trending'అంటే సుందరానికీ' షూటింగ్‌లో పాల్లొన్న నజ్రియా

‘అంటే సుందరానికీ’ షూటింగ్‌లో పాల్లొన్న నజ్రియా

Nazriya In Ante sundaranik
టాలీవుడ్‌ హీరో నేచురల్ స్టార్ నాని న‌టిస్తోన్న 28వ చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా న‌జ్రియా న‌జీమ్ తెలుగులో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతోంది. ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన న‌జ్రియా సోమవారం నుండీ ‘అంటే సుంద‌రానికీ’ మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. హైద‌రాబాద్‌ లో జ‌రుగుతున్న ఈ షెడ్యూల్‌లో న‌జ్రియా స‌హా ఇతర కీల‌క తారాగ‌ణంపై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ‌ఈ సంద‌ర్భంగా హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్ ”నా ఫ‌స్ట్ తెలుగు మూవీ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చేస్తున్నాను.

ఈ రోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. ఫ‌స్ట్‌ చేసే పని ఏదైనా స్పెషల్‌గా ఉంటుంది. కాబట్టి ‘అంటే సుందరానికీ’ నాకు చాలా స్పెషల్‌” అని తన భావాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు మాట్లాడుతూ.. ”మా టీమ్ త‌రపున న‌జ్రియా న‌జీమ్‌ను స్వాగ‌తిస్తున్నాం. త‌న‌కి, మ‌రియు మా టీమ్ అంద‌రికీ ఈ చిత్రం త‌ప్ప‌కుండా ప్ర‌త్యేకంగా ఉంటుంది” అని అన్నారు. ‘బ్రోచేవారెవ‌రురా’ త‌ర్వాత వివేక్ ఆత్రేయతో కలిసి తన‌ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. రవితేజ గిరిజ‌ల ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu