HomeTelugu Big Storiesమరో వివాదంలో అమిర్‌ ఖాన్‌.. నెటిజన్స్‌ ఫైర్‌

మరో వివాదంలో అమిర్‌ ఖాన్‌.. నెటిజన్స్‌ ఫైర్‌

Netizens faults aamir khanబాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అమిర్‌ ఖాన్‌ తన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఆసక్తి చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా అమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు అమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.

ఈ వ్యవహారంపై అమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను అమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu