HomeTelugu Trending'హాయ్‌ నాన్న' నుంచి కొత్త పోస్టర్‌

‘హాయ్‌ నాన్న’ నుంచి కొత్త పోస్టర్‌

New poster from Hi Nanna

నాని హీరోగా నటిస్తున్న హాయ్‌ నాన్న. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ డైరెక్షన్‌ నాని 30గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే హాయ్‌ నాన్న నుంచి మేకర్స్‌ లాంఛ్‌ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

తాజాగా ఈ సినిమా నుండి కూల్‌ లుక్ ఒకటి విడుదల చేశారు. నాని తన కూతురుతో కలిసి ఓ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న లుక్‌ షేర్ చేశారు మేకర్స్‌. హాయ్‌ అక్టోబర్‌.. చల్లటిగాలి కోసం రెడీగా ఉండండి.. అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పుడీ లుక్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఈ నెలలో మరో పాట ఏమైనా విడుదల చేస్తున్నారా.. అంటూ తెగ చర్చించుకుంటున్నారు.

ఇటీవలే నాని టీం తమిళనాడులోని కూనూర్, ఊటీలో హాయ్‌ నాన్న కొత్త షెడ్యూల్‌ పూర్తి చేసింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న హాయ్ నాన్నలో మృణాళ్‌ ఠాకూర్ యశ్న పాత్రలో నటిస్తోండగా.. బేబి కైరా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది. హర్ట్‌ టచింగ్ ట్యూన్‌తో సాగే టైటిల్‌ గ్లింప్స్‌ వీడియో హాయ్ నాన్న మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu