HomeTelugu Newsకొణిదెల వారి అల్లుడు ఇతనేనా!

కొణిదెల వారి అల్లుడు ఇతనేనా!

14 3మెగా డాటర్‌ నిహారిక పెళ్లి త్వరలో జరగనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నిహారిక చేసిన ఓ పోస్ట్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు చిన్న హింట్ ఇచ్చింది. నిహారిక స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘Ms. Niha’ అని రాసి ఉండగా ‘Ms.’ని కొట్టేసి ‘Mrs.’ అని క్వశ్చన్ మార్క్ ( ? ) పెట్టింది. దానికి ”ఉహ్.. వాట్ ?” అని కామెంట్ జత చేసింది. దీంతో మెగా అభిమానుల్లో నిహారిక పెళ్లిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. కాసేపటికే మరో పోస్ట్ పెట్టి తన పెళ్లి విషయాన్ని కంఫర్మ్ చేసింది ఈ బ్యూటీ. తనకి కాబోయే భర్తని హగ్ చేసుకుని ఉన్న ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో మెగా డాటర్ కి వరుడు దొరికేశాడని అర్థం అయింది. కాకపోతే ఈ ఫొటోలో తనకు కాబోయేవాడి బ్యాక్ సైడ్ ని మాత్రమే చూపించింది. అతని ఫేస్ ని మాత్రం చూపించలేదు. ఇక సినీ ప్రముఖులు మెగా అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక నిహారిక పెళ్లి గురించి ఇస్తున్న హింట్ చూసి.. రేపు ఆమెకు కాబోయే భర్త ఫేస్ చూపిస్తుందేమో అని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిహారిక పెళ్ళి చేసుకోబేయే వ్యక్తి పేరు వెంకట చైతన్య జోన్నలగడ్డ అని.. గుంటూరుకు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి కుమారుడని.. ఆగస్టులో వీరి నిశ్చితార్ధం, ఈ ఏడాది చివరిలోగా వివాహం జరగబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!