HomeTelugu Trendingతమిళంలో మెగా డాటర్‌ ఎంట్రీ..

తమిళంలో మెగా డాటర్‌ ఎంట్రీ..

1 3

మెగా డాటర్‌ నిహారికకి పాపం సరైన హిట్ ఒక్కటీ పడలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆమెకు చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. అందువల్ల ఇక్కడ తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే ఇప్పుడు తాను ఓ తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిజమేనంటూ ఎవరితో నటించబోతుందో స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేసింది. అయితే ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస విజయాలతో దుకుపోతున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో తాను నటించబోతున్నానని తన ఇంస్టాగ్రామ్ లో తెలిపింది. అయితే చూడాలి మరి ఈ సినిమానైనా హిట్ అయ్యి మెగా హీరోల మాదిరిగా తనకు ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుందా లేదా అనేది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu