HomeTelugu News'ఆచార్య' సినిమాలో నిహారిక స్పెషల్‌ రోల్‌!

‘ఆచార్య’ సినిమాలో నిహారిక స్పెషల్‌ రోల్‌!

2 8
మెగా వారసురాలు నిహారిక.. హీరోయిన్‌గా రెండు మూడు సినిమాలు చేసింది. అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వకపోవడంతో వెబ్‌సీరిస్‌పై దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఆ తరువాత మెగా హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి చారిత్రక చిత్రమైన ‘సైరా’లో ఒక ప్రత్యేక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలోను ఆమె ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా తెలియాల్సి వుంది. కాగా ఇప్పటికే ‘ఆచార్య’లో సినిమాలో రామ్‌ చరణ్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నాడని వినికిడి. ఇప్పుడు నిహారిక పేరు కూడా ఈ ప్రాజెక్టులో వినిపిస్తుండటంతో, ఈ సినిమాపై మెగా అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. నిహారిక చేయడం నిజమే అయితే, ఆమె పాత్ర ఎలా ఉంటుంది అనేది చర్చనీయంశంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu