HomeTelugu Trendingనిఖిల్, వీఐ ఆనంద్ కాంబోలో మరో సినిమా

నిఖిల్, వీఐ ఆనంద్ కాంబోలో మరో సినిమా

 

Nikhil latest movie sequel

హీరో నిఖిల్ ప్రతి సినిమాలో కొత్త కంటెంట్‌తో కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. వరుస సినిమాలతో తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ‘స్పై’ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

ప్రస్తుతం నిఖిల్ వంశీకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘ది ఇండియా హౌస్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరో వైపు ‘స్వయంభూ’ సినిమాను కూడా పూర్తిచేసే పనిలో ఉన్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుద్ధవీరుడిగా నిఖిల్ కనిపించబోతున్నాడు.

నిఖిల్ మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో నిఖిల్‌తో ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ అనే సినిమాను దర్శకుడు వీఐ ఆనంద్ రూపొందించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మించబోతున్నారట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటన వెలువడనుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu