HomeTelugu Big Stories'పుష్ప'లో తొమ్మిది మంది విలన్లా?

‘పుష్ప’లో తొమ్మిది మంది విలన్లా?

Nine villians in pushpa mస్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌ ఫిక్స్‌ అయిపోయింది. ఇక విలణ్‌ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఈ పాత్ర కోసం బాబీ సింహా, విజయ్‌ సేతుపతి… ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మరో పేరు కూడా వినిపిస్తోంది. అంతే కాదు విలన్ల సంఖ్య మీద కూడా మరో కొత్త వార్త వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు మొత్తంగా తొమ్మిది మంది విలన్‌లు ఉన్నారట.

‘పుష్ప’రాజ్‌ను ఢీకొట్టడానికి టాలీవుడ్‌ కొత్త విలన్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. ‘డిస్కోరాజా’, ‘కలర్‌ఫొటో’తో తనలోని విలనిజం చూపించిన సునీల్‌ ‘పుష్ప’కి విలన్‌ అవుతాడని అంటున్నారు. మరోవైపు ‘చియాన్‌’ విక్రమ్‌ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇక ఈ సినిమాలో తొమ్మిది మంది విలన్లు ఉంటారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ… ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పాత కాలం సినిమాల్లోలాగా ‘పుష్ప’లో ఎక్కువమంది విలన్లను పెడుతున్నారట సుకుమార్‌. దీనికి సంబంధించి బేసిక్‌ వర్క్‌ కూడా పూర్తయిందట. అయితే ఇది ఎంత వరుకు నిజం అనేది తెలియాల్సి ఉంది. కాగా సెట్‌లో బన్ని పలు ఫొటోలు సోషల్‌ మీడియలో వైరల్‌ అయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu