HomeTelugu Newsనితిన్‌ నిశ్చితార్థం డేట్‌ ఫిక్స్‌

నితిన్‌ నిశ్చితార్థం డేట్‌ ఫిక్స్‌

11 12
టాలీవుడ్ హీరో నితిన్ నిశ్చితార్ధం రేపు హైదరాబాద్ లో జరగబోతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగబోతున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా నితిన్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి పేరు షాలిని. లండన్ లో చదువుతున్న సమయంలో అమ్మాయి ప్రేమలో పడిపోయాడట ఈ హీరో.

ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడం, వారు కూడా ఒప్పుకోవడంతో పెళ్ళితంతు మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈరోజు విడుదలైన సింగిల్ సాంగ్ తో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్.

11a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu