కల్యాణ్‌ రామ్‌ ‘118’ టీజర్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘118’. కే.వి గుహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈస్ట్‌ కోస్ట్‌‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌, షాలిని పాండేల లవ్‌స్టోరీతో టీజర్‌ మొదలైంది. ‘ఆ రోజు వరకు..’ అని చూపిస్తూ 1.18 గంటల సమయంలో ఏదో ప్రమాదం జరగడాన్ని చూపించారు. ఆ ప్రమాదం ఏంటి? ఎవరు చేశారు? అన్న విషయాన్ని కల్యాణ్‌రామ్‌ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. టీజర్‌ను బట్టి చూస్తే ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలా అనిపిస్తోంది. శేఖర్‌ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.