HomeTelugu Big StoriesNithiin: 'రాబిన్‌హుడ్‌'గా నితిన్‌

Nithiin: ‘రాబిన్‌హుడ్‌’గా నితిన్‌

 

nithiin venky kudumula movi

Nithiin: వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తూ.. గ్లింప్స్ వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రానికి రాబిన్‌హుడ్‌ టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ గ్లింప్స్ లో.. నితిన్‌ ఈ సారి సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది.

నితిన్‌ ఈ సారి దొంగగా కనిపించబోతున్నట్టు గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో నటకిరిటీ రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని, రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫర్‌ కాగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్‌. రామ్‌ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌.

బ్లూ థీమ్‌తో డిజైన్‌ చేసిన పోస్టర్‌లో నితిన్‌ మోడ్రన్‌ రాబిన్‌హుడ్‌గా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. సాంటాక్లాజ్‌ గెటప్‌లో కనిపిస్తూ తనదైన డైలాగ్ డెలివరీతో ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. చాలా కాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌ ఈ సినిమాతో ఎలాగైన హిట్‌ కొట్టాలి అని చూస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu