HomeTelugu Big Storiesదుబాయిలో రోబో 2.0 ఆడియో!

దుబాయిలో రోబో 2.0 ఆడియో!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘2.0’. ఈ చిత్రాన్ని ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా ‘2.0’ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌లో దుబాయ్‌లో విడుదల చేయనున్నారు. అలాగే నవంబర్‌లో టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్‌ చేస్తారు. డిసెంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలిపారు. ఈ చిత్రాన్ని జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu