HomeTelugu Trendingఅల్లుడి హీరోయిన్‌తో మామ రొమాన్స్‌ చేయనున్నడా!

అల్లుడి హీరోయిన్‌తో మామ రొమాన్స్‌ చేయనున్నడా!

2 23
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా పవన్ ఈ సినిమా తరువాత క్రిష్ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటకు వచ్చాయి. అవేంటంటే… ఇందులో పవన్ మొగలాయిల కథ చేస్తున్నాడని చెప్పాడు. ఈ సినిమా మొగలాయిల కాలం నాటి కథ అని.. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తుంది. అయితే క్రిష్ కూడా ఈ సినిమాను పవర్ స్టార్ స్థాయికి తగ్గట్టుగానే సిద్ధం చేస్తున్నాడట.

అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారంట… కానీ వారు ఎవరు అనే విషయం మాత్రం ఇంకా క్లారీటి రాలేదు. అయితే అందులో ఓ హీరయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లేదా కీర్తిసురేష్ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా నివేదా పేతురాజ్‌ని తిసుకుంటే బాగుంటుందని డైరెక్టర్‌ అనుకుంటున్నాడట. కాగా నివేదా పేతురాజ్ దేవ కట్టా డైరెక్షన్‌లో సాయి ధరమ్ నటిస్తున్న ఓ సినిమాలో హీరోయన్‌గా నటిస్తుంది. అయితే చూడాలి మరి అల్లుడి సినిమాలో అవకాశం కొట్టేసిన ఈ అమ్మడు మామ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంటుందా… లేదా అనేది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu