HomeTelugu Trendingవిలన్‌ పాత్రకు సై అంటున్న యంగ్‌ హీరోయిన్‌!

విలన్‌ పాత్రకు సై అంటున్న యంగ్‌ హీరోయిన్‌!

Nivetha thomas ready for vi
టాలీవుడ్‌లో నాని ‘జెంటిల్‌మన్‌’ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నివేదా థామస్. ఆ తరువాత ఎన్టీఆర్‌ ‘జై లవ కుశ’, కల్యాణ్‌రామ్‌ ‘118’ చిత్రంలోనూ నటించింది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వి’ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కానుంది. నివేదా థామస్.. ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ‘వి’ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నివేదా థామస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమాలో అపూర్వ అనే క్రైమ్ నవలా రచయితగా కనిపిస్తానని తెలిపింది. ఓటీటీ కోసం వర్క్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. మంచి నటిగా గుర్తింపు ఉంటే చాలని చెప్పుకొచ్చింది. ఇక విలన్ గా చేసే అవకాశం వస్తే చేయడానికి సిద్ధమేనని.. నెగెటివ్ షేడ్ పాత్రల్లో నటించడానికి ఎదురుచూస్తున్నా అని తెలిపింది నివేద థామస్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu