HomeTelugu TrendingRRR నుంచి రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఫొటో.. వైరల్‌

RRR నుంచి రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఫొటో.. వైరల్‌

Ntr and ram charan practici

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్‌ఆర్‌ఆర్‌” షూటింగ్‌ శరవేగంగా జరుకుతుంది. భారీ బడ్జెట్‌ తో వస్తున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 13న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఫొటోలను షేర్‌ చేశారు. కాగా జనవరి 19న క్లైమాక్స్‌ షూటింగ్‌ ప్రారంభమైనట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది. ‘వాళ్లు అనుకున్నది సాధించేందుకు కొమురం భీమ్‌, సీతారామరాజు ఏకమయ్యారు’ అంటూ ఇద్దరూ చేతులు కలిసిన ఫొటోను షేర్‌ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి తాజా ఫొటో క్యాప్షన్‌తో ఈ క్లైమాక్స్‌ కథ కూడా ముగింపుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu