HomeTelugu Big Storiesమరో ఘనత సాధించిన ఎన్టీఆర్‌

మరో ఘనత సాధించిన ఎన్టీఆర్‌

ntr in the top 50 asian staపాన్‌ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ కీలక పాత్ర లో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ మరో ఘనత సాధించారు. 2023లో ఆసియాలో టాప్‌ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ విషయాన్ని ఏషియన్‌ వీక్లీ మ్యాగజైన్‌ ప్రకటించింది.

ఈ జాబితాలో తారక్‌ 25వ స్థానలో నిలిచారు. ఈ జాబితాను ఈస్టర్న్‌ ఐ 2023 వెల్లడించింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక హీరో జూనియర్ కావడం విశేషం. అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ మొదటి స్థానంలో నిలిచారు.

మరికొందరు బాలీవుడ్‌ తారలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిలో ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రణ్‌బీర్‌ కపూర్‌ 6వ, దళపతి విజయ్ 8వ స్థానంలో సాధించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu