రకుల్ కు ఎవరూ ప్రపోజ్ చేయలేదట!

దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం న‌టించిన ‘జ‌య జాన‌కి నాయ‌క’ ఆగ‌ష్టు 11న రిలీజ్ సంద‌ర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై స్పందించింది.
”నాకు ఇద్ద‌రు ట్రై చేసినా ప‌డ‌లేదు.. నేనింత‌వ‌ర‌కూ ఎవ‌రికీ ప్ర‌పోజ్ చేయ‌లేదు” అని చెబుతోంది అందాల రకుల్‌.

ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం చేసుకోన‌ని, ప్రేమించే పెళ్లి చేసుకుంటాన‌ని క్లారిటీనిచ్చింది ఈ పంజాబీ బొమ్మ‌. కెరీర్ ఆరంభంలో తెలుగు రాని కారణంగా చాలా బాధ‌ప‌డేదానిని.. ఆ తరువాత తెలుగు నేర్చుకున్నాన‌ని తెలిపింది. తాజా చిత్రంలో త‌న పాత్ర తెలుగు ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌ని విజువ‌ల్ ట్రీట్ ఇస్తుంద‌ని చెప్పింది. న‌వ‌త‌రం హీరో సాయి శ్రీ‌నివాస్ చ‌క్క‌గా న‌టించ‌డాని కితాబిచ్చింది.