HomeTelugu Big Storiesఆర్‌ఆర్‌ఆర్‌: చరణ్‌ అసహనం.. వీడియో షేర్‌ చేసిన ఎన్టీఆర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌: చరణ్‌ అసహనం.. వీడియో షేర్‌ చేసిన ఎన్టీఆర్‌

Ntr shares ram charan video
టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో శరవేగంగా జరుగుతోంది. చరణ్‌-తారక్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఉక్రెయిన్‌లో టీమ్‌ ఏం చేస్తుంది? అక్కడ షూట్‌ ఎలా జరుగుతుంది? ఇలాంటి విశేషాలు తెలియజేస్తూ ఈ రోజు నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇన్‌స్టా ఖాతాలో పోస్టులు చేయనున్నట్లు తారక్‌ తెలిపారు.

దీనిలో భాగంగా ఎన్టీఆర్‌ తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. రామ్‌చరణ్‌ కొంత అసహనానికి గురైనట్లు ఇందులో చూడవచ్చు. ‘చరణ్‌ డ్రమ్స్‌ ప్రాక్టీస్‌ అయ్యిందా?’ అని తారక్‌ అడగ్గా.. ‘అయిపోయింది. నిజమైన డ్రమ్స్‌ ఎక్కడ కార్తికేయ. కాస్ట్యూమ్‌ లేదు. ఏం లేవు. పొద్దుపొద్దునే తీసుకువచ్చి కూర్చొపెట్టారు’ అని రాజమౌళి కుమారుడిపై చరణ్‌ సరదాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కార్తికేయ.. ‘వస్తున్నాయి. రెండు నిమిషాలు’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. దసరాకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రానున్నట్లు చరణ్‌ మరోసారి ఈ వీడియోలో స్పష్టం చేశారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఆలియాభట్, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, ఒలీవియా మోరీస్‌, ఎలిసన్‌ డ్యూడీ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu