HomeTelugu Trendingబంగార్రాజు: 'నువ్వు సిగ్గుపడితే బాగుంటావే' సాంగ్‌ టీజర్‌

బంగార్రాజు: ‘నువ్వు సిగ్గుపడితే బాగుంటావే’ సాంగ్‌ టీజర్‌

Nuvvu Siggupadithe
నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా గా ‘బ్లాక్ బస్టర్ మీట్’ను కూడా జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ టీజర్ ను వదిలారు. ‘నువ్వు సిగ్గుపడితే బాగుంటావే ఓ సత్యభామ .. సిగ్గులో సింగారముంటాదే, వద్దన్నా కొద్దీ ముద్దొస్తావే నా ఎన్నెలమ్మా .. గారంగా చూస్తూనే గారం చేస్తావే’ అంటూ ఈ పాట సాగుతోంది. నాగార్జున – రమ్యకృష్ణలపై చిత్రీకరించిన ఈ పాట బ్యూటిఫుల్ గా ఉంది. కొరియోగ్రఫీ కూడా బాగుంది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాట ఆకట్టుకుంటోంది. చాలా కాలం తరువాత నాగార్జున – రమ్యకృష్ణ కలిసి తెరపై సందడి చేసిన పాట ఇది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాలో, నాగచైతన్య బుల్లి బంగార్రాజుగా కనిపించగా ఆయన జోడీగా కృతి శెట్టి అలరిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu