HomeTelugu Trending'ఓ సాథియా' సాంగ్‌ వైరల్‌

‘ఓ సాథియా’ సాంగ్‌ వైరల్‌

O Saathiya Lyrical song vir
మహిళ దర్శకనిర్మాతలు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ సాథియా’. చందన కట్టా.. తన్విక – జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాకి.. దివ్య భావన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో .. హీరోయిన్లుగా నటిస్తున్నారు. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదుగా తాజాగా విడుదల చేసిన ‘ఓ సాథియా’ టైటిల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. వన్ మిలియన్ వ్యూస్‌కు చేరువలో ఉన్న ఈ పాటకి ‘విన్నూ’ సంగీతాన్ని అందించగా .. భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. జావెద్ అలీ ఆలపించాడు. ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu