HomeTelugu Trendingలక్ష్మీపార్వతిని, పూనంకౌర్‌ను వేధిస్తున్నది ఒకడేనా?

లక్ష్మీపార్వతిని, పూనంకౌర్‌ను వేధిస్తున్నది ఒకడేనా?

1 14
నటి పూనం కౌర్‌ను సోషల్‌ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్న నిందితుడు.. వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిని వేధిస్తున్నదీ ఒక్కడేనని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానళ్లలో అశ్లీల కథనాలు, అసభ్య రాతలు పోస్ట్‌ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్‌ వేర్వేరుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూనం కౌర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్న నిందితుడి పేరు.. లక్ష్మీపార్వతిని వేధించిన నిందితుడి పేరు ఒకటేనని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడితో పాటు మరో వ్యక్తికి ఈ నేరంలో సంబంధం ఉందని తెలుసుకున్నారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాళ్లు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం సేకరించారు. లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, పూనం కౌర్‌పై గత 8 నెలలుగా అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను పోస్ట్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. నిందితులు చిక్కితే వీళ్లు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా? వ్యక్తిగత కక్షతో చేస్తున్నారా? అనేది బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu