HomeTelugu Big Storiesపక్కా కమర్షియల్: ట్రైలర్‌ వచ్చేసింది

పక్కా కమర్షియల్: ట్రైలర్‌ వచ్చేసింది

pakka commercial movie trai

గోపీచంద్‌ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యానర్‌పై బ‌న్నీ వాసు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఆదివారం నాడు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జూలై 1న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu