రజిని కూతురు విడాకుల వ్యవహారం!

రజినీకాంత్ కూతురు సౌందర్య గ్రాఫిక్స్ టెక్నాలజీలో మంచి పట్టు సాధించింది. 2010లో అశ్విన్
రామ్ కుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఓ బిడ్డ కూడా పుట్టింది.
అయితే గత కొంత కాలంగా వీరిద్దరు దూరంగా ఉంటున్నారని త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని
కోలీవుడ్ మీడియా వార్తలు ప్రచురించింది. దీంతో ఇదొక హాట్ టాపిక్ గా మారిపోయింది. తాజాగా
సౌందర్య ఈ విషయాలపై స్పందించింది. ఏడాది కాలంగా తను, భర్త అశ్విన్ తో దూరంగా ఉంటున్నానని
చెప్పిన ఆమె.. విడాకులు తీసుకోబోతున్నామనే అనే మాటలు వాస్తవమే అని వెల్లడించారు.
ఇది పూర్తిగా తమ కుటుంబ వ్యవహారమని ఎటువంటి ఊహాగానాలకు తావివ్వద్దంటూ ఆమె ట్విట్టర్
లో కోరారు. ఈ మద్యకాలంలో పెళ్లిళ్లు చేసుకోవడం.. అతి కొద్ది రోజుల్లోనే డివోర్స్ తీసుకోవడం
మన సినీ తరాలకు కామన్ అయిపోయింది.

CLICK HERE!! For the aha Latest Updates