HomeTelugu Big Storiesహ్యాపీ బర్త్‌డే 'ప్రభాస్‌'

హ్యాపీ బర్త్‌డే ‘ప్రభాస్‌’

prabhas bday
టాలీవుడ్‌ డార్లింగ్‌ యంగ్‌ రెబల్‌ నేడు (అక్టోబరు 23) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా క్లాప్‌ బోర్డ్‌ ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియలియజేస్తుంది. టాలీవుడ్‌లో కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

prabhas bday3బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.. ఆయన రాధాకృష్ణ డైరెక్షన్‌లో నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సలార్, బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు స్పిరిట్ టైటిల్‌తో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో మరో మూవీకి సైన్‌ చేశాడు. ఈ సినిమాలపై ఫ్యాన్స్‌ భారీ ఆశలే పెట్టుకున్నారు.

prabhas bday2ప్రభాస్‌కు కెరీర్‌ పరంగా తనను అత్యున్నత స్థానంలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి అంటే ప్రభాస్‌కి ఎనలేని అభిమానం. జక్కన్న తర్వాత అంత ఇష్టమైన దర్శకుడు మరొకరు ఉన్నారు. బాలీవుడ్‌ ఫీల్‌గుడ్‌ చిత్రాల దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ. ఆయన సినిమాలను అమితంగా ఇష్టపడతాడు. ప్రభాస్‌ మంచి భోజన ప్రియుడు. దీంతో పాటు వాలీబాల్ అంటే ప్రాణం. దానికోసం ఇంటి ఆవరణలోనే ప్రత్యేక మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్నేహితులతో కలిసి తరచూ ఇక్కడే ఆటలాడుతూ కాలక్షేపం చేస్తాడు.

3ఇక ప్రభాస్‌ పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ బర్త్‌డేకి అయిన ప్రభాస్‌ తన పెళ్లి కబురు చెబుతాడు అని ఫ్యాన్స్‌ ఆస్తికగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు డార్లింగ్‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీజ‌ర్లు, ఫస్ట్‌లుక్‌, పోస్టర్లతో సందడి నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu