HomeTelugu Trendingహంట్‌: 'పాపతో పైలం' సాంగ్‌ విడుదల

హంట్‌: ‘పాపతో పైలం’ సాంగ్‌ విడుదల

Papa Tho Pailam Lyrical fro
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’. ‘గన్స్ డోన్ట్ లై’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమాలో అతను యాక్షన్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా ‘ప్రేమిస్తే’ భరత్, సీనియర్ హీరో శ్రీకాంత్ మేకా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ నుండి విడుదలైన ప్రచార చిత్రాలు మరియు టీజర్ అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలోని ‘పాపతో పైలం’ అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను రిలీజ్‌ చేశారు. ఈ ఐటమ్ సాంగ్‌లో అప్సర రాణి ఆడిపాడింది. సుధీర్ బాబుతో పాటుగా శ్రీకాంత్ మరియు భరత్ కూడా ఈ పాటలో కనిపించారు.

మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఎనర్జిటిక్ కంపోజిషన్ లో వచ్చిన ఈ డ్యాన్స్ నంబర్ మాస్ ని బాగా ఆకట్టుకుంటోంది. సింగర్స్ మంగిలి మరియు నకాష్ అజీజ్ తమదైన శైలిలో హుషారుగా ఆలపించారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. మహేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని.. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu