అస్సిస్టెంట్ డైరెక్టర్ తో నటి ప్రేమాయణం!

సినిమా సెట్ లో హీరోయిన్లతో అస్సిస్టెంట్ డైరెక్టర్స్ లవ్ అఫైర్స్ నడిపించడం సాధారణమే. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే హీరోయిన్స్ కూడా వారితో ప్రేమాయణం సాగించడం హాట్ టాపిక్ కు తెర తీస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా ఇలాంటి ఓ గాసిప్ తో వార్తల్లో నిలిచింది. అవును.. పరిణితీ ప్రేమలో పడింది. ఓ అస్సిస్టెంట్ డైరెక్టర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది అంటూ బాలీవుడ్ మీడియా ప్రచురిస్తోంది. ఇంతకీ ఆ అస్సిస్టెంట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? అతడి పేరు మనీష్.
 
ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలోనూ ఆ పేరు లీకైంది. లేడీస్ వర్సెస్ రికీ బాల్, శుధ్ దేశీ రొమాన్స్ వంటి సినిమాలకు పని చేసినప్పటి నుండి కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ విషయం నిజమే అనే ప్రచారం ఊపందుకుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్. అయితే ఈ రిలేషన్స్ ఎప్పటివరకు ఉంటాయని మాత్రం ఎవరు చెప్పలేరు. మరి పరిణితీ ప్రేమ ఎక్కడ వెళ్తుందో.. చూడాలి. ప్రస్తుతం ఈ భామ నటించిన ‘మేరీ ప్యారీ బిందు’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.