HomeTelugu Trendingమహేష్, రాజమౌళి గురించి పవన్ కల్యాణ్ ఏమన్నారంటే!

మహేష్, రాజమౌళి గురించి పవన్ కల్యాణ్ ఏమన్నారంటే!

Pawan comments about Rajamo
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 28న విడుదల కానుంది. సముద్రఖని దర్శకుత్వం వహించిన చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తెలుగు పరిశ్రమలో ప్రతి అగ్ర నటుడితో తాను స్నేహంగా ఉంటానని, వారి సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటానని చెప్పారు.

దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారని పవన్ ప్రశంసించారు. అలాగే మహేశ్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమాను ప్రస్తావించారు. మహేశ్ – రాజమౌళి సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనకు అందరు హీరోలు ఇష్టమేనని వారివల్ల ఎందరో కడుపు నిండుతుందని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu