HomeTelugu Trendingటాప్‌ ట్రెండింగ్‌లో పవన్‌.. రికార్డు బ్రేక్‌ చేసిన ఫ్యాన్స్

టాప్‌ ట్రెండింగ్‌లో పవన్‌.. రికార్డు బ్రేక్‌ చేసిన ఫ్యాన్స్

Pawan fans record breaks in

జనసేన అధినేత, టాలీవుడ్‌ హీరో పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు పండుగ కోసం ఆయన ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ‘సెప్టెంబ‌ర్ 2’న ఆయన పుట్టిన‌ రోజు ఈ నేపథ్యంలో అభిమానులు మాత్రం అప్పుడే సోష‌ల్ మీడియాలో ‘#AdvanceHBDPawanKalyan’ హ్యాష్ ట్యాగ్‌ను సృష్టించారు.ఈ హ్యాష్‌ ట్యాగ్ జత చేస్తూ పోటీలు పడి అభిమానులు పోస్టులు చేస్తుండడం ట్విట్ట‌ర్‌ ట్రెండింగ్‌లో ఇది రికార్డు సృష్టించింది. కేవలం 24 గంట‌ల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 27.3 మిలియ‌న్ల ట్వీట్లు వ‌చ్చాయి. పవన్ అభిమానులు ప్రతి ఏడాది ఇలాగే చేస్తారు. తమ ట్వీట్లు టాప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చే వరకు ట్వీట్లు చేశారు.

ఇటీవల ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌ కూడా ఇదే విధంగా లక్షలాది ట్వీట్లు చేసి హ్యాపీ బర్త్‌ డే ఎన్టీఆర్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను టాప్‌ ట్రెండింగ్‌లోకి తీసుకువెళ్ళారు. అన్ని రికార్డులను బద్దలు కొడుతూ పవన్ అభిమానులు ‘#AdvanceHBDPawanKalyan’ హ్యాష్ ట్యాగ్‌ను టాప్‌కి తీసుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu